Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన రంగం హీరోయిన్

కార్తీక నాయర్, ఫియాన్సీ ఫోటోలు వైరల్..

Courtesy: Twitter

Share:

Karthika Nair: సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఎవర్గ్రీన్ హీరోయిన్ రాధ (radha) కూతురు కార్తీక్ నాయర్, ఇటీవల నిశ్చితార్థం (Engagement) జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తన నటనతో సినిమా (Cinema)లతో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కార్తీక నాయర్ (Karthika Nair), తన కాబోయే భర్త ఎవరో చూపిస్తూ సోషల్ మీడియాలో తన ఫోటో (Photo)ల ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. 

కాబోయే భర్తను పరిచయం చేసిన రంగం హీరోయిన్: 

కార్తీక నాయర్ (Karthika Nair) ఇటీవల సినిమా (Cinema)లలో పెద్దగా కనిపించినప్పటికీ, నటి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన నిశ్చితార్థం (Engagement) వార్తలను కూడా ప్రకటించింది. అయితే, ఆమె తన కాబోయే భర్త పేరును ప్రస్తావించలేదు.. అంతేకాకుండా తన భర్త ఫోటో (Photo)లను కూడా షేర్ చేసుకోలేదు కార్తీక నాయర్ (Karthika Nair). ఇటీవల సోషల్ మీడియాలో తలుక్కుమన్న ఈ తార, జోష్ నటి కార్తీక నాయర్ (Karthika Nair). తన కాబోయే భర్త రోహిత్ మీనన్‌ను పరిచయం చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా తీసుకున్న ఫోటో (Photo)లను షేర్ చేసింది. అంతేకాకుండా తన కాబోయే భర్త తనకి కలవడం తన డస్ట్ని అని, తమ కొత్త జీవితాని ప్రారంభించడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ రాసుకోవచ్చింది కార్తీక నాయర్ (Karthika Nair).

కార్తీక నాయర్ (Karthika Nair) అక్టోబర్‌లో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నారు.. ఆమె తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ తన కాబోయే భర్తతో తీసుకున్న ఫోటో (Photo)లను షేర్ చేసుకున్నారు. అయితే, షేర్ చేసిన ఫోటో (Photo)లలో రోహిత్ ముఖం పూర్తిగా కనిపించలేదు. బహుశా పెళ్లి వరకు వెయిట్ చేయాల్సిందే. 

 

కార్తీక నాయర్ సినిమాలు: 

కార్తీక నాయర్ (Karthika Nair) చివరిగా జయరాజ్ నిర్మించిన చేసిన 2021 డ్రామా ఫిల్మ్ బ్యాక్‌ప్యాకర్స్‌లో కనిపించింది. ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, రెంజీ పనికర్, సబితా జయరాజ్ మరియు పలువురు ప్రముఖ పాత్రలు పోషించారు. ఒకరినొకరు ప్రేమించుకున్న ఇద్దరు కేన్సర్ పేషెంట్ల కథను ఈ సినిమా (Cinema)లో చూపించడం జరుగుతుంది. నేరుగా OTTలో విడుదలైన ఈ చిత్రం అభిమానులు నుంచి పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది.

ఈ నటి తదుపరి తమిళ యాక్షన్ చిత్రం వా డీల్‌లో కనిపించనుంది, ఇందులో అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రథిన శివ డైరెక్ట్ చేశారు, ఈ చిత్రానికి సంగీతం థమన్ ఎస్. ఈ చిత్రానికి కెమెరా, గోపీ జగదేశ్వరన్. 

కార్తీక నాయర్ గురించి మరింత: 

31 సంవత్సరాల కార్తికా నాయర్ (Karthika Nair) ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమా (Cinema)ల్లో నటించింది. కార్తీకా (Karthika Nair)  తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ (radha) . ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక  చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమా (Cinema)ల్లో నటించింది. కార్తికా ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా. 2009లో తన 17వ ఏట తెలుగు సినిమా (Cinema) జోష్ తో తెరంగేట్రం  చేసింది. ఈ సినిమా (Cinema)లో ఆమె నాగచైతన్య సరసన  నటించింది. ఆమె రెండో సినిమా (Cinema)  రంగం.  తమిళంలో  తీసిన  ఈ  సినిమా (Cinema)ను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.ఆ తరువాత ఆమె  మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు  సినిమా (Cinema)లో  నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె భారతీరాజా దర్శకత్వంలో అన్నాకొడి సినిమా (Cinema)లో నటించింది.