ప్రభాస్ ఫ్యాన్స్ తో మామూలుగా ఉండదు.. సలార్ టికెట్ బుకింగ్ సర్వర్లు క్రాష్!

Salaar టికెట్లు విడుదల చేసిన వెంటనే ఒక్కసారిగా లక్షలాది మంది ఓపెన్ చేయడంతో బుక్ మై షో యాప్ కాసేపు పని చేయలేదు. యూజర్ల తాకిడి ఎక్కువ కావడంతో యాప్ క్రాష్ అయ్యింది. యాప్ క్రాష్ కావడంతో కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో, ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్లోడ్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టింది.

Courtesy: x

Share:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ విడుదల అంటే ఆయన ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా సలార్ మూవీ విడుదల సందర్భంగా టికెట్ల కోసం ఫ్యాన్స్ క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశాయి. దీంతో టికెట్లను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ లో వెయిటింగ్ లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో టికెట్స్ ఇలా ఓపెన్ చేయడమే ఆలస్యం జనాలు బుక్ మై షో యాప్ లో భారీగా బుకింగ్స్ చేసుకున్నారు.


టికెట్లు విడుదల చేసిన వెంటనే ఒక్కసారిగా లక్షలాది మంది ఓపెన్ చేయడంతో బుక్ మై షో యాప్ కాసేపు పని చేయలేదు. యూజర్ల తాకిడి ఎక్కువ కావడంతో యాప్ క్రాష్ అయ్యింది. యాప్ క్రాష్ కావడంతో కాసేపు బ్రేక్ ఇచ్చిన బుక్ మై షో, ఆ తర్వాత అన్ని థియేటర్ల టికెట్స్ ఒకేసారి అప్లోడ్ చేయకుండా నెమ్మదిగా ఒక్కో థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బుక్ మై షో క్రాష్ అయిన ఫొటోలు స్క్రీన్ షాట్స్ తీసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు​. దీన్ని బట్టి చెప్పొచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారనేది. 


నైజాంలో మైత్రీ మూవీ సంస్థ కేవలం మల్టీప్లెక్స్ టికెట్లను మాత్రమే ఆన్​లైన్​లో పెట్టింది. సింగిల్ స్క్రీన్​ టికెట్లను కౌంటర్ల వద్ద అమ్మకాలు ప్రారంభించింది. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొందరు ఫ్యాన్స్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మైత్రీ సంస్థపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో టికెట్ కౌంటర్ వద్ద అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో నియంత్రించలేకపోయిన పోలీసులు వారిపై లాఠీ ఛార్జీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్​తోపాటు శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. 

ప్రీమియర్ షోలకు ప్రభుత్వ అనుమతి:
సలార్ సినిమా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు బెని‌ఫిట్ షోలు వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. సలార్ మూవీ ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తున్నట్లుగా రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.