Ram Charan: అకాడమీ యాక్టింగ్ బ్రాంచ్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్

రామ్ చరణ్ (Ram Charan) నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమా (Cinema)తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రామ్ చరణ్ (Ram Charan), ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. RRR సినిమా (Cinema) అనంతరం ప్రపంచవ్యాప్తంగా తన యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరు చెప్పుకునేలా చేసుకున్నాడు అందుకే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్ (Ram Charan). అయితే ప్రస్తుతం మరో మైలురాయిని చేరుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan).  ఇటీవల అనౌన్స్ […]

Share:

రామ్ చరణ్ (Ram Charan) నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమా (Cinema)తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రామ్ చరణ్ (Ram Charan), ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. RRR సినిమా (Cinema) అనంతరం ప్రపంచవ్యాప్తంగా తన యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరు చెప్పుకునేలా చేసుకున్నాడు అందుకే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్ (Ram Charan). అయితే ప్రస్తుతం మరో మైలురాయిని చేరుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan). 

ఇటీవల అనౌన్స్ చేసిన అకాడమీ అవార్డ్స్..: 

RRRలో తన నటనతో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసిన రామ్ చరణ్ (Ram Charan) ముఖ్యంగా అంతర్జాతీయ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్‌గా నిలిచాడు. ప్రపంచ సినిమా (Cinema)కి చెందిన అనేక ఇతర నటీనటులతో పాటుగా అకాడమీ యాక్టింగ్ బ్రాంచ్ (Academy Acting Branch) లో రామ్ చరణ్ (Ram Charan) భాగమని, ఇటీవల అకాడమీ అవార్డ్స్ ప్రకటించారు. అకాడెమీ రామ్ చరణ్ (Ram Charan) కు సత్కరించిన గౌరవాన్ని అకాడమీ అవార్డ్స్ అధికారికంగా ప్రకటించారు. 

తమ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఎకౌంట్ ద్వారా అధికారక ప్రకటనను షేర్ చేసుకుంటూ, అకాడమీ ద్వారా నటీనటులకు దక్కిన ఘనత కేవలం వారికి నటనపై ఉన్న అంకిత భావం అని, ఈ నటులు మన హృదయాలు మరియు మనస్సులపై శాశ్వతమైన ముద్ర వేసే పాత్రలను బహుమతిగా ఇచ్చారని.. తమ నటనతో సహజమైన భావోద్వేగాలను పంచి మరింత మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని రాస్కొచ్చింది అకాడమీ.

రామ్ చరణ్ (Ram Charan) కాకుండా, లషానా లించ్, విక్కీ క్రిప్స్, లూయిస్ కూ టిన్-లోక్, కేకే పామర్, చాంగ్ చెన్, సకురా ఆండో మరియు రాబర్ట్ డేవిలను కూడా అకాడమీ యాక్టింగ్ బ్రాంచ్ (Academy Acting Branch) లో బాగా మని ప్రకటించడం జరిగింది. 

RRR, ఈ చిత్రం భారతీయ సమాజంలో భారీ ప్రేక్షకులను సంపాదించుకోవడమే కాకుండా అంతర్జాతీయ రంగాల నుండి కూడా అద్భుతమైన ఆదరణను పొందింది. దానికి లభించిన ఆదరణ అభిమానం అంతా ఇంతా కాదు. 

రామ్ చరణ్ రాబోయే సినిమాలు: 

మొదటిలో కియారా అద్వానీ (Kiara Advani)- రామ్ చరణ్ (Ram Charan) జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ (Game Changer) సినిమా (Cinema) ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా (Cinema)కి ఇప్పటివరకు శంకర్ డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ గేమ్ చేంజర్ (Game Changer) సినిమా (Cinema)ను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. 

నిర్మాత దిల్ రాజు (Dil Raju)కు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్ (Ram Charan)‌ల సినిమా (Cinema) గేమ్ చేంజర్ (Game Changer) ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా (Cinema). అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమా (Cinema)ను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

సినిమా (Cinema) చాలాసార్లు ఆలస్యం అవుతుండడంతో, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి శైలేష్ కొలను బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ -రామ్ చరణ్ (Ram Charan)‌ కొంబోలో రాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా (Cinema) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్‌గా మారవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదనే చెప్పాలి. శైలేష్ సినిమా (Cinema)లో కొంత భాగం మాత్రమే డైరెక్ట్ చేయడం జరుగుతుందని మిగిలిన ముఖ్యమైన సినీ సన్నివేశాలు మొత్తం శంకర్ చేతుల మీదగా డైరెక్ట్ అవుతుందని స్పష్టమైంది.