Vijay Deverakonda: రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: రష్మిక మందన్న(Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో(Deep Fake Video)పై హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) తీవ్రంగా స్పందించారు. ఇలాంటివి అణిచివేయడానికి సమర్థవంతమైన విభాగాన్ని ఏర్పాటు చేయాలని పోస్ట్ పెట్టారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) మార్ఫింగ్‌ వీడియో(Morphing video) అంశం గత మూడు రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. డీప్ ఫేక్ వీడియోల విషయంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి […]

Share:

Vijay Deverakonda: రష్మిక మందన్న(Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో(Deep Fake Video)పై హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) తీవ్రంగా స్పందించారు. ఇలాంటివి అణిచివేయడానికి సమర్థవంతమైన విభాగాన్ని ఏర్పాటు చేయాలని పోస్ట్ పెట్టారు.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) మార్ఫింగ్‌ వీడియో(Morphing video) అంశం గత మూడు రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. డీప్ ఫేక్ వీడియోల విషయంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నుంచి టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య వరకూ పలువురు సెలబ్రిటీలు రష్మీకకు మద్దతుగా సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఈ ఇష్యూపై యువ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) స్పందించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా క్రియేట్ చేసిన రష్మిక మందన్న(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ అడ్వైజరీ(Advisory)ని కూడా జారీ చేసింది. ఈ వార్తను విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. భవిష్యత్తు కోసం తప్పకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎవరికీ ఇలాంటివి జరగకూడదని, అలాంటి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

“భవిష్యత్తు కోసం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరికీ ఇలా జరగకూడదు. ఇలాంటి వాటిని అణిచివేయడానికి, తక్షణ చర్యలు తీసుకునేందుకు, వెంటనే శిక్షించడానికి ఓ సమర్థవంతమైన సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు మరింత సురక్షితంగా ఉంటారు.” అని విజయ్ తన ఇన్‌స్టా స్టోరీ(Insta story)లో పోస్ట్ చేశారు. డీప్ ఫేక్ వీడియో ఇష్యూలో విజయ్ దేవరకొండ తన కోస్టార్ రష్మికాకు మద్దతుగా నిలుస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు నెట్టింట వైరల్(Viral) గా మారింది.

కాగా, బ్రిటిష్-ఇండియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ జరా పటేల్(Zara Patel) ముఖాన్ని రష్మిక మందన్న పేస్ తో మార్ఫింగ్ చేసిన డీప్ ఫేక్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం 24 గంటల్లోగా తొలగించాలని, ఎక్కడా కనిపించకూడదని అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఇలాంటి మార్ఫింగ్‌ వీడియో(Morphing video)లకు సంబంధించిన నిబంధనలను మరోసారి గుర్తు చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. డీప్‌ ఫేక్‌ వీడియోలు క్రియేటింగ్‌ , షేరింగ్‌ , సర్క్యులేషన్‌కు సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలు గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖ ఆయా సామాజిక మాధ్యమాల సంస్థలకు అడ్వయిజరీని పంపించింది. దీనిపైనే స్పందించిన విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) భవిష్యత్తు కోసం ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని సూచించాడు.

జారా మార్ఫింగ్ వీడియోపై రష్మిక మందన్న(Rashmika Mandanna) స్పందిస్తూ.. ఈ వీడియోను షేర్ చేయడానికి, దాని గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. డీప్ ఫేక్ వీడియో(Deep fake video) ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇది నాకే కాదు.. ప్రతీ మహిళ ఆందోళన చెందాల్సిన విషయంగా మారింది. టెక్నాలజీని(Technology) ఇలా దుర్వినియోగం చేయడం దారుణంగా అనిపిస్తుంది అని రష్మిక సోషల్ మీడియాలో స్పందించారు.

ఇక సినిమాల విషయానికొస్తే, ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో జోడీగా నటించిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం తెలిసిందే. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ లోనూ కలిసి కనిపిస్తుండటంతో, వీరి సంబంధంపై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇద్దరూ పలు సందర్భాల్లో తమపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. తాము మంచి స్నేహితులమని, తమ మధ్య మంచి బాండింగ్ ఉందని పేర్కొన్నారు.