బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న సలార్.. సక్సెస్ సెలబ్రేషన్స్ చూడండి

Salaar Part-1 Ceasefire: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. నేటికి సలార్ విడుదలై 17 రోజులు అవుతోంది.

Courtesy: x

Share:

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. నేటికి సలార్ విడుదలై 17 రోజులు అవుతోంది. అయితే, ఈ 17 రోజుల్లో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సలార్ నిలిచింది. 17 రోజుల్లో దాదాపు రూ.670 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టడం విశేషం. 

సినిమా చివరలోనే సలార్‌-2 గురించి ఇంట్రడ్యూస్ చేయడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్‌ పార్ట్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మూవీ టీం, హైదరాబాద్‌లోని మైత్రి మూవీ మేక‌ర్స్ చిత్ర నిర్మాణ కార్యాలయంలో తాజాగా చిన్న సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. సినిమాని బ్లాక్ థీమ్ లో ఆడియన్స్ కి చూపించిన వీరందరూ, ఈ సక్సెస్ పార్టీలో కూడా బ్లాక్ డ్రెస్ లో కనిపించడం విశేషం. ప్రభాస్, పృథ్వీరాజ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సక్సెస్ ని చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసేసుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక పాన్ ఇండియా వైడ్ ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. లాటిన్ అమెరికాలో స్పానిష్ వెర్షన్ ని మార్చి 7న విడుదల చేయబోతున్నారు. ఆ తరువాత జపాన్ లో జపనీస్ లాంగ్వేజ్ లో సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా జపాన్ లో ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్‌తో జపాన్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయ్యింది. ఈ రిలీజ్ లతో సలార్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ రూ.670 కోట్ల వరకు గ్రాస్ అందుకున్నట్లు సమాచారం.

బాహుబలి సిరీస్ తర్వాత భారీ హిట్ కొట్టని ప్రభాస్, తాజాగా ‘సలార్’ మూవీతో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా తొలి రోజు రూ.178 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ‘సలార్’ మూవీ ముఖ్యంగా బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపురుష్ తర్వాత హిందీలో రూ.100 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన 5వ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా హిందీలో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ఈ సినిమా వసూళ్లు చెబుతున్నాయి.