Samyukta: తెలుగు తెరకు సంయుక్త పరిచయం

ఇప్పటికే తమిళంలో హిట్టయిన భామ

Courtesy: Twitter

Share:

Samyukta: తెలుగు (Telugu) తెరకు ఎంతో మంది హీరోయిన్లు (Heroines) పరిచయం అయ్యారు. కొత్తగా పరిచయం అవుతున్నారు. తెర అనేది అదో రకమైన లక్ ఫ్యాక్టర్ (Luck Factor). చాలా మంది నటీనటులు పరిచయం అయినా కానీ ఇక్కడ కొంత మందే తమ సత్తాను చూపించగల్గుతారు. అటువంటి వారు మాత్రమే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతారు (Stable). అందుకోసమే ఇండస్ట్రీకి (Industry) రోజు ఎంతో మంది వస్తున్నా కానీ ఇక్కడ నిలదొక్కుకునేది కేవలం వేళ్ల మీద లెక్కబెట్టేలా ఉంటారు. అందుకనే ఈ సినీ ఇండస్ట్రీకి లక్ ఫ్యాక్టర్ చాలా అవసరం అని చెబుతుంటారు. అదీ నిజమే అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. లక్ (Luck) లేకుండా ఇక్కడ ఎటువంటి పనులు జరగవు. అందుకే చాలా మంది తారలు ఫేడ్ అవుట్ (Fade Out) అవుతూ ఉంటారు. ఇప్పటికే ఎంతో మంది ఉన్న ఇండస్ట్రీకి మరో అందం పరిచయం కాబోతుంది. ఆ అందం పేరు సంయుక్త (Samyukta). తెలుగు నాట ఈ భామ సినిమాలు చేయకపోయినా కానీ తమిళంలో (Tamil) ఇప్పటికే అనేక సినిమాలు (Movies) చేసి మెరిసింది. అందుకోసమే తెలుగు డెబ్యూ (Debue) చాలా ఈజీ అయిపోయింది. 

అందాలు ఆరబోసినా కానీ.. 

సినీ ఇండస్ట్రీలో అందాలు (Beauty) ఆరబోస్తే(Expose) అవకాశాలు వాటంతట అవే పరుగెత్తుకుంటూ వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ అందాలు ఆరబోసిన అందరు ముద్దుగుమ్మలకు (Heroines) ఆఫర్లు రావు. వారు నెంబర్ వన్ హీరోయిన్లు అయిపోరు. అందాల ఆరబోత చేసినా కానీ కూసింత అదృష్టం (Luck) లేకపోతే ఇక్కడ తట్టుకోవడం చాలా కష్టం. అందుకోసమే సినీ ఇండస్ట్రీ  (Cine Industry) వాళ్లు లక్ కోసం చాలా పూజలు చేస్తూ ఉంటారు. అయినా కానీ కొంత మందికి మాత్రమే ఈ లక్ ఫ్యాక్టర్ కలిసొస్తుంది. అందుకోసమే ఇక్కడ హిట్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ ఇక్కడ సినిమాలు చేసి ప్రూవ్ చేసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తుంటారు. 

తమిళంను ఏలినా కానీ.. 

తమిళ సినిమాల్లో (Movies) నటించిన హీరోయిన్లు తెలుగు సినిమాల్లో తెలుగు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మలు తమిళ (Tamil) సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు. అలాగే తమిళ పరిశ్రమలో చేతి నిండా ఆఫర్లతో (Full Offers) ఉన్న సంయుక్త వియోలా విశ్వనాథన్ (Samyukta) తెలుగులో చారి 111 (Chari 111) మూవీతో పరిచయం కాబోతుంది. ఈఅమ్మడు ఇప్పటికే తమిళంలో అనేక మూవీలు చేసింది. ఈ మూవీలో హీరోయిన్ గా అమ్మడు పేరును కన్ఫమ్ చేసి. .షూట్ కూడాకంప్లీట్ (Complete) చేశారు. ఈ మూవీకి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం (Direction) చేశారు. అదితి సోని నిర్మించిన ఈ స్పై థ్రిల్లర్ మూవీలో వెన్నెల కిషోర్ (Vennela Kishore) కూడా నటించారు. టాలీవుడ్ వంటి మోస్ట్ హిట్ పరిశ్రమలో భాగం కావడం చాలా గొప్పగా అనిపిస్తుందని సంయుక్త పేర్కొంది. నేను ఒక స్పై థ్రిల్లర్‌ లో నటించడం అది కూడా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ బ్యూటీ పేర్కొంది. ఇంతకంటే ఏ హీరోయిన్ కు కూడా పర్ఫెక్ట్ లాంచ్ ఉండదని వెల్లడించింది. 

చెప్పాలని ఉంది కానీ.. 

ఏ మూవీ ప్రమోషన్స్ లో అయినా తమ పాత్రల గురించి బయటకు చెప్పాలని ఉన్నా తారలు (Actors) బయటకు రివీల్ చేయలేరు. అలా రివీల్ (Reveal) చేస్తే సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుందనేది వారి నమ్మకం. సంయుక్త కూడా అవే కామెంట్స్ (Comments) చేసింది. ఈ మూవీలో తన పాత్ర గురించి బయటకు చెప్పాలని ఉన్నా తాను చెప్పలేకుండా ఉన్నానని పేర్కొంది. ఈ మూవీలోఅనేక యాక్షన్ సీక్వెన్స్ లు చేసినట్లు పేర్కొంది. అమ్మడు కెరీర్ చూసుకుంటే చాలా ఆసక్తి కలుగుతుంది. ఈ బ్యూటీకి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నపుడే అమ్మడు డ్యాన్సింగ్ ను ఎంచుకుంది. 

డ్యాన్స్ కు దూరం 

సంయుక్త (Samyukta) చిన్న వయసులోనే డ్యాన్స్ (Dance) కు దూరం అయింది. లిగమెంట్ ఇంజూరీ (Ligament Injury) వల్ల సంయుక్త తనకు ఎంతో ఇష్టం అయిన డ్యాన్స్ కు దూరం అయింది. కాలేజీలో (College) ఉండగానే ఈ బ్యూటీకి ఆపరేషన్ జరిగింది. అయినా కానీ అవేమీ తనను డ్యాన్స్ నేర్చుకోనివ్వకుండా ఆపలేదని అమ్మడు పేర్కొంది. ఈ బ్యూటీకి ఇప్పటికీ వాటికి సంబంధించిన పెయిన్ వస్తూనే ఉంటుందట. కళాశాలలో ఉన్నప్పుడు, సంయుక్త రంగస్థల నాటకాలలో చురుకుగా పాల్గొనేది. అంతే కాకుండా షార్ట్ ఫిల్మ్‌  (Short Films)లు మరియు యాడ్ కమర్షియల్‌ లలో కూడా అమ్మడు నటించింది. ఇలాగే నటనపై ఉన్న ఆసక్తితో అమ్మడు థియేటర్ (Theater) ప్రాక్టీస్ కోసం వెళ్లింది. అక్కడే అలా ప్రాక్టీస్ చేసి హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆమె ఓహ్ మనపెన్నె మరియు జాక్సన్ దురై అనే రెండు చిత్రాలకు మొదట సంతకం (Sign) చేసింది. 

నేర్చుకున్నది అదే.. 

దర్శకుడు ఏది చేయాలని కోరుకుంటాడో తాను అదే చేస్తానని సంయుక్త (Samyukta) తెలిపింది. తాను ఇదే విషయం నేర్చుకున్నానని వెల్లడించింది. అమెరికాలో (America) ఉన్న అమ్మడు పాండమిక్ సమయంలో చెన్నైకి (Chenna) వచ్చింది. దాంతో ఇక అమెరికాకు వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చిందట. ఈ విషయాలను స్వయంగా సంయుక్తనే (Samyukta) పంచుకున్నారు. అలా ఇక్కడ సినిమాలు చేస్తూ సంయుక్త ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా ఇప్పుడు తెలుగు సినిమాలు (Telugu Movies) కూడా చేసేందుకు ఈ బ్యూటీ సిద్దం అయిపోయింది. ఆల్రెడీ ఈ బ్యూటీ (Beauty) చేసిన ఒక తెలుగు సినిమా కూడా విడుదలకు సిద్ధం అయింది.

Tags :