Simran: పాక్ పీఎంగా సమరసింహ రెడ్డి హీరోయిన్

సెకండ్ ఇన్నింగ్స్ లో బాలీవుడ్ ను ఏలుతున్న బ్యూటీ

Courtesy: Twitter

Share:

simran: నందమూరి నటసింహం నటించిన సమర సింహ రెడ్డి (Samarasimha Reddy) సినిమా గురించి తెలుగు (Telugu) అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో పాన్ ఇండియా (Pan India) సినిమాల హవా లేదు కానీ ఉంటే అది అప్పట్లోనే పాన్ ఇండియా (Pan India) మూవీ అయ్యేది. బాలయ్య బాబు కెరియర్ (Career) లో చెప్పుకోదగ్గ సినిమాగా ఈ మూవీ (Movie) నిలిచింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా అందాల తార సిమ్రన్ (Simran) నటించింది. సిమ్రన్ తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఒకప్పుడు టాప్ హీరోయిన్ (Top Heroine) గా వెలుగొందింది. అనేక మంది స్టార్ హీరోలతో సిమ్రన్ జతకట్టింది. కేవలం స్టార్ హీరోలు అని మాత్రమే కాకుండా కుర్ర హీరోల సరసన కూడా స్క్రీన్ షేర్ (Screen Share) చేసుకుంది. అటువంటి సిమ్రాన్ కొద్ది రోజులుగా తెలుగులో ఎక్కువగా సినిమాలు (Cinemas) చేయడం లేదు. పెళ్లి చేసుకుని కెరియర్ మీద కంటే పిల్లల మీద ఈ అమ్మడు ఎక్కువ ఫోకస్ చేసింది. అడపాదడపా సినిమాలు చేసినా కానీ వరుస పెట్టి సినిమాలు చేయలేదు. దీంతో సిమ్రన్ (Simran) సెకండ్ ఇన్నింగ్స్ ఆశించినంత స్వింగ్ లో లేదని అనేక మంది అనుకున్నారు. అదే విధంగా సిమ్రాన్ సినిమాల ఎంపిక కూడా సాగింది. కానీ ఈ మధ్య ఒక్కసారిగా సిమ్రన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. సమరసింహ రెడ్డి (Samarasimha Reddy)  బ్యూటీ తో మాములుగా ఉండదని ఇది తెలిసిన అందరూ కామెంట్ (Comment) చేస్తున్నారు. 

 

టైగర్-3లో ప్రధాని పాత్రలో 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన టైగర్-3 (Tiger-3) మూవీ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ మూవీలో సమరసింహ రెడ్డి (Samarasimha Reddy)  యాక్ట్రస్ ఒక రోల్ లో మెరిసింది. అది అటువంటి ఇటువంటి ఆషామాషీ రోల్ కాదు. ఏకంగా అమ్మడు  పాకిస్తాన్ (Pakistan) ప్రధాని రోల్ లో కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఇది చూసిన సిమ్రన్ అభిమానులు ఇన్ని రోజులకు ఆమెకు తగిన పాత్ర వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. ఇక టైగర్-3 సినిమా గురించి చెప్పుకుంటే ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ (Bollywood) కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించగా.. అతని సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా మెరిసింది. ఇక వీరి కాంబోలో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ (Positive Talk) తో దూసుకుపోతుంది. 

 

పాక్ కు వెళ్లే గూఢచారిగా సల్మాన్

ఈ మూవీలో పాక్ (Pak) కు వెళ్లే గూఢచారి పాత్రలో సల్మాన్ ఖాన్ (Salman Khan) మెరిశాడు. పాకిస్తాన్ ప్రధానిగా అలనాటి స్టార్ నటి సిమ్రన్ (Simran) నటించింది. ఆమె 1997లో అబ్బాయి గారి పెళ్లి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది మరియు ఆ తర్వాత చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వంటి సూపర్‌స్టార్‌ లతో కలిసి పని చేసింది మరియు ఆమె చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద హిట్ అందుకుని.. కలెక్షన్ల (Collections) వర్షం కురిపించాయి. ఆమె లక్కీ లేడీగా కూడా పిలిపించుకున్నారు. సిమ్రన్ తనదైన డ్యాన్స్ (Dance) తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. ఆమె సమరసింహారెడ్డి, కలిసుందం రా, 'నువ్వు వస్తావాని మరియు నరసింహా నాయుడు వంటి చిత్రాలలో చిరస్మరణీయ పాత్రలు పోషించి, ఆపై తమిళ చిత్రాలకు వెళ్లిపోయింది. తమిళ నాట కూడా అమ్మడు తనదైన మార్క్ తో సినిమాలు క్రియేట్ చేసింది. 

 

మహేశ్ తో కూడా.. 

సిమ్రన్ కేవలం పెద్ద హీరోలతో మాత్రమే కాదు. మహేశ్ బాబు (Mahesh Babu) వంటి కుర్రహీరోలతో కూడా యాక్ట్ చేసింది. మహేశ్ నటించిన యువరాజు సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లు చేయలేకపోయినా కానీ సిమ్రన్ (Simran) నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె చివరిగా తెలుగు చిత్రం 'అప్పారావు 40 ప్లస్'లో కనిపించింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే క్యారెక్టర్స్ చేయడంతో సిమ్రన్ కు తెలుగు నాట ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదు. కానీ ప్రస్తుతం మాత్రం సిమ్రాన్ బాలీవుడ్ (Bollywood) సినిమాలో మిడిల్ ఏజ్ రోల్ లో కనిపించి అందర్నీ అట్రాక్ట్ చేసింది. 

 

తెలుగులోకి కూడా.. 

అమ్మడు ఇన్ని రోజుల పాటు మిడిల్ ఏజ్ రోల్స్  (Middle Age Roles) చేయలేదు కాబట్టి తెలుగు సినిమాలు కూడా చేయదని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ టైగర్-3లో మిడిల్ ఏజ్ రోల్ లో కనిపించడంతో త్వరలో ఈ అలనాటి స్టార్ హీరోయిన్ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు నాట కూడా పెద్ద సినిమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. దీంతో సిమ్రన్ (Simran) ను త్వరలోనే మనం తెలుగు తెరపై ఓ మిడిల్ ఏజ్ రోల్ లో చూస్తామని ఫ్యాన్స్ అంటున్నారు. సిమ్రన్ కనుక తెలుగులో మదర్, వదిన రోల్స్ చేసేందుకు అంగీకరిస్తే ఆమెకు ఆఫర్స్ క్యూ కడతాయని అంతా కామెంట్ చేస్తున్నారు. మరి సిమ్రన్ తెలుగులో (Telugu) అటువంటి రోల్స్ (Roles) చేస్తుందో లేక తెరకు దూరంగానే ఉంటుందో చూడాలి.