Jawan Movie: జవాన్‌ మూవీ మరో అరుదైన ఫీట్‌..

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా రికార్డు

Courtesy: Twitter

Share:

Jawan Movie: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్‌ చిత్రం (Jawan Movie) తాజాగా మరో అరుదైన రికార్డును (Jawan creates history) తన ఖాతాలో వేసుకుంది‌. నవంబర్‌ 2వ తేదీన ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం.. తొలి రెండు వారాల్లోనే అత్యధికంగా వీక్షించిన చిత్రంగా (Most Watched Film In India) నిలిచింది.

ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ‘పఠాన్‌’ (Pathaan)తో కలెక్షన్‌ కోత సృష్టిస్తే. ద్వితియార్థంలో ‘జవాన్‌’ (Jawan)తో కలెక్షన్‌ల మోత మోగించారు. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర ‘జవాన్‌’ సినిమా కోట్లు కొల్లగొట్టింది. సుమారు రూ.1068 కోట్లకుపైగా వసూళ్లతో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. సినీ చరిత్రలో అత్యధిక గ్రాస్ సాధించిన హిందీ సినిమా (ఒరిజినల్‌ లాంగ్వేజ్‌)గా కూడా ‘జవాన్‌’ (Jawan) రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డును (Jawan creates history) తన ఖాతాలో వేసుకుంది‌. 

జవాన్‌ చిత్రం(Jawan Movie) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 2వ తేదీన ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం.. తొలి రెండు వారాల్లోనే అత్యధికంగా వీక్షించిన చిత్రంగా (Most Watched Film In India) నిలిచింది. ఏ సినిమా క్రియేట్ చేయలేని అరుదైన ఫీట్‌ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌(Netflix) ఇండియా తన అధికారిక సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ‘విక్రమ్ రాథోడ్ మా హృదయాలను, రికార్డులను హైజాక్ చేశారు..! నెట్‌ఫ్లిక్స్‌లో అన్ని భాషల్లో విడుదలైన మొదటి 2 వారాల్లో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన చిత్రం జవాన్’ అంటూ ట్వీట్‌ చేసింది. 

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ (Atlee) దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. జవాన్‌లో ప్రియమణి(Priyamani), సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రలు పోషించారు. హై ఆక్టేన్ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్‌ ఖాన్‌ హోంబ్యానర్ రెడీ చిల్లీస్‌(Home Banner Ready Chillies) ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.

నేటి సమాజంలోని తప్పులను ఎత్తిచూపుతూ, వాటిని సరిద్దిదడానికి ప్రయత్నించే ఓ వ్యక్తి ఎమోషనల్ జర్నీగా 'జవాన్' చిత్రాన్ని (Jawan Movie) తెరకెక్కించారు. సామాజిక, రాజకీయ అంశాలను హైలైట్ చేస్తూ పక్కా కమర్షియల్ సినిమాగా హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు దర్శకుడు అట్లీ. ఇందులో షారుఖ్ డ్యూయల్ రోల్ ప్లే చేసారు. తండ్రీ కొడుకులు విక్రమ్ రాథోడ్(Vikram Rathod), ఆజాద్ (Azad) పాత్రల్లో అదరగొట్టారు. స్టైలిష్ యాక్షన్ తో అభిమానాలను విశేషంగా అలరించారు.

షారుక్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ఇది ఆమెకు హిందీ డెబ్యూ మూవీ. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా.. దీపికా పదుకొణె(Deepikapadukone), సంజయ్ దత్(Sanjay Dutt) ప్రత్యేక అతిధి పాత్రల్లో కనిపించారు. వీరితో పాటుగా ప్రియమణి, సన్యా మల్హోత్రా, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా, యోగి బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం సమకూర్చారు.

'జవాన్' చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై షారూక్ ఖాన్ సరీమణి గౌరీ ఖాన్(Gowri Khan) 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించిన ఈ చిత్రం.. హయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన హిందీ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 'పఠాన్'(Patan) కలెక్షన్స్ ను క్రాస్ చేసి ఈ ఏడాదిలో మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిందీ వెర్షన్ రూ. 566 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా.. తెలుగు తమిళ భాషలు కలుపుకొని రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.