Harshvardhan Kapoor:నువ్వు ఎవరు అని అడగలేదా అంటూ ట్రోల్

రిప్లై ఇచ్చిన హర్షవర్ధన్ కపూర్..

Courtesy: Twitter

Share:

Harshvardhan Kapoor: హర్ష్ వర్ధన్ కపూర్ (Harshvardhan Kapoor) ఇటీవల సోనమ్ కపూర్ హోస్ట్ చేసిన డిన్నర్ పార్టీ (Party)లో, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్ (David Beckham)‌తో కలిసి తీసుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అప్పటి నుంచి చాలామంది ట్రోల్స్ (Trolls) చేస్తూ హర్షవర్ధని ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన కూల్ గా సమాధానం ఇచ్చారు.

ఇంతకీ అసలు ఏమైంది: 

లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ (David Beckham) ఇటీవల భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ICC ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ కోసం ముంబైకి చేరుకున్నాడు. తరువాత, అతను సోనమ్ కపూర్ మరియు ఆమె భర్త ఆనంద్ అహూజా ఇచ్చిన డిన్నర్ పార్టీ (Party)కి హాజరయ్యాడు. సోనమ్ సోదరుడు, హర్ష వర్ధన్ కపూర్ (Harshvardhan Kapoor) కూడా బెక్‌హాం కోసం జరిగిన బాష్‌కి హాజరై, అతనితో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా , అతని పోస్ట్ ట్రోల్స్‌కు (Trolls) గురి అయింది. హర్ష్ వర్ధన్ కపూర్ (Harshvardhan Kapoor) ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, డేవిడ్ బెక్‌హామ్ (David Beckham)‌కి హర్ష్ వర్ధన్ కపూర్ (Harshvardhan Kapoor) ఎవరో తెలుసా అని ట్రోల్స్ (Trolls) సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే ఇది చూసిన హర్షవర్ధన్ కపూర్ తనదైన శైలిలో కూల్ గా సమాధానం ఇవ్వడం జరిగింది.

అతని పోస్ట్‌కు ఇంటర్నెట్ నుండి స్పందనలు వచ్చాయి. డేవిడ్ బెక్‌హామ్ (David Beckham)కి అసలు నువ్వు ఎవరో తెలుసా? అంటూ ఒక వ్యక్తి కామెంట్ పెట్టగా.. అది చూసిన హర్షవర్ధన్.. అతను మా ఇంటికి వచ్చాడు.. అసలు నువ్వెవరు? అంటూ రిప్లై ఇచ్చాడు.

పార్టీకి వచ్చిన డేవిడ్ బెక్‌హామ్: 

UNICEF గుడ్‌విల్ అంబాసిడర్‌గా తన పర్యటనలో భాగంగా, ఇక్కడ తన మూడు రోజుల పర్యటనలో, డేవిడ్ బెక్‌హామ్ (David Beckham) అనేక పార్టీ (Party)లకు హాజరయ్యారు. అనేక మంది ప్రముఖులను కలిశారు. దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, డేవిడ్ బెక్‌హామ్ (David Beckham), సారా అలీ ఖాన్‌తో ముంబైలోని మెటా కంపెనీలో మాట్లాడటానికి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. సోనమ్ కపూర్ మరియు ఆనంద్ అహూజా మాజీ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడికి స్టార్-స్టడెడ్ గ్రాండ్ వెల్‌కమ్ పార్టీ (Party)ని కూడా నిర్వహించారు. ఇదొక్కటే కాకుండా, ముంబై ఇండియన్స్ యజమానులు అంబానీ కుటుంబాన్ని సందర్శించడానికి డేవిడ్ బెక్‌హామ్ (David Beckham) గురువారం యాంటిల్లాకు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. గత రాత్రి, అతను షారుక్ ఖాన్ హోస్ట్ చేసిన ప్రైవేట్ బాష్‌కు హాజరయ్యాడు. డేవిడ్ బెక్‌హాం చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ డాక్యుసీరీస్ 'బెక్‌హాం'లో కనిపించాడు, అది సాకర్ ప్లేయర్‌గా అతని జీవితాన్ని, వృత్తిని చాలా బాగా చూపించారు.

హర్ష్ వర్ధన్ గురించి మరింత: 

హర్ష్ వర్ధన్ కపూర్ (Harshvardhan Kapoor) భారతీయ నటుడు. ప్రముఖ కపూర్ కుటుంబానికి చెందినవారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మాజీ మోడల్ సునీతా కపూర్ ల చిన్న కుమారుడు, నటి సోనం కపూర్, రియా కపూర్ ల తమ్ముడు హర్ష్ వర్ధన్ కపూర్ (Harshvardhan Kapoor). అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన బాంబే వెల్వెట్ (2015) సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేశారు హర్ష. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో మిర్జ్యా (2016) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసారు. ఈ సినిమాలో కపూర్ ఒక పోరాటం చేసే యోధుడిగా కనిపించాడు.రాజస్థాన్ లో జరిగే చారిత్రక ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సైయామీ ఖేర్ కనిపించారు.

హర్ష్ వర్ధన్ కపూర్ (Harshvardhan Kapoor) చివరిగా విడుదలైన నెట్‌ఫ్లిక్స్ 'థార్'లో కనిపించడు. ఇప్పుడు మరోసారి ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా బయోపిక్‌లో అతను తదుపరి చిత్రంలో కనిపించనున్నాడు.