Varun Tej-Lavanya: దీపావళి ఫొటో షూట్ లో మెరిసిన వరుణ్ తేజ్-లావణ్య

నెట్టింట వైరల్ అయిన కొత్త జంట ఫొటోలు

Courtesy: twitter

Share:

Varun Tej-Lavanya: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya) ఇద్దరూ మొన్నే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. చాలా రోజుల పాటు ప్రేమించుకుని (Love) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya) ప్రేమించుకుంటున్న విషయం కూడా ఎవరికీ తెలియలేదు. సెలబ్రెటీలు (Celebrities) ఏం చేసినా కానీ ఇట్టే పసిగట్టే సోషల్ మీడియా (Social media) వీరి ప్రేమ విషయంలో మాత్రం విఫలం అయింది. 

వీరు పెళ్లి డేట్ అనౌన్స్ చేసే వరకు ఎవరికీ అనుమానం కూడా రాలేదు. ఈ ఇద్దరు ఇది వరకే సినిమాలలో నటించారు. కానీ ఈ ఇద్దరిపై ఎవరు కూడా ఇంత వరకు ప్రేమికులు (Lovers) అనే ముద్ర వేయలేదు. అసలు వీరు ఎంగేజ్ మెంట్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అందరూ నమ్మడానికి కొంత సమయం తీసుకున్నారు. వీరిద్దరు ఏంటి ప్రేమించుకోవడం ఏంటని చర్చించుకున్నారు. ఇక వారు ఫైనల్ గా పెళ్లి డేట్ (Marriage Date) ను కూడా అనౌన్స్ చేయడంతో ఇక ప్రతి ఒక్కరూ నమ్మక తప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కొద్ది మంది సమక్షంలో..

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya) జంట ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) చేసుకున్నారు. వీరి వెడ్డింగ్ కు ఇరు కుటుంబాల నుంచి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వీరు ఇటలీలో వివాహం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వారు సినీ ఇండస్ట్రీ వారి కోసం ఇక్కడ ప్రత్యేకంగా రిసెప్షన్ (Reception) ఏర్పాటు చేశారు. దీంతో వీరి పెళ్లిని ప్రేక్షకులు ఎవరూ పెద్దగా చూడలేకపోయారు. వీరి పెళ్లి వీడియో ఓ ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నా కానీ అలా మాత్రం జరగలేదు. ఈ నెల ప్రారంభంలో వీరు ఇటలీలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఈ నూతన వధూవరులు ఇటీవల తమ మొదటి దీపావళి (Deepavali)ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవడానికి ఫొటో షూట్ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి. 

వైరల్ అవుతున్న ఫొటోలు

ఈ కొత్త జంటకు సంబంధించిన దీపావళి ఫొటోలు (Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట కెమిస్ట్రీపై (Chemistry) అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట చిత్రాలలో చాలా చూడముచ్చటగా ఉన్నారని అంతా కామెంట్లు చేస్తున్నారు. వరుణ్ తేజ్ నలుపు రంగు షేర్వాణీ వేసుకోగా..లావణ్య త్రిపాఠి రూబీ-రెడ్ లెహంగా చోలీ సెట్‌ లో చక్కదనంగా వయ్యారాలు ఒలకబోసింది. ఇక అంతే కాకుండా అట్రాక్టివ్ (Attractive) చెవిపోగులను కూడా అమ్మడు ధరించింది. నూతన వధూవరులు తమ కుటుంబంతో దీపాల పండుగను జరుపుకోవడం మరియు ట్రెడిషనల్ దుస్తులను ధరించి తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వరుణ్ తేజ్ తన తల్లి (Mother), తండ్రి, సోదరితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

హాజరైన మెగా హీరోలు

డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట ఇటలీ (Italy)లో వివాహం జరిగినా కానీ మెగా హీరోలు మాత్రం పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లికి సాయి తేజ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, చిరంజీవితో పాటు అనేక మంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఈ జంట పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది. పరిశ్రమకు (Industry) చెందిన స్నేహితులు, రాజకీయ నాయకులు మరియు పరిశ్రమలోని ఇతర స్నేహితులను వారు ఆహ్వానించారు. ఈ రిసెప్షన్ కూడా కన్నుల పండుగ (Grand)గా జరిగింది. 

వరుణ్ చివరగా అందులోనే.. 

వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం మట్కా, ఆపరేషన్ వాలంటైన్ అనే మూవీలు చేస్తున్నాడు. మట్కా సినిమాలో వరుణ్ కు జోడీగా యంగ్ యాక్ట్రస్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) నటిస్తోంది. ఆయన చివరగా గాంఢీవదారి అర్జున అనే యాక్షన్ ఫిల్మ్ (Action Film) చేశాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ వహించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో సాక్షి వైద్య, నాసర్, నరేన్, మనీష్ చౌదరి మరియు మరింత మంది ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ మూవీ క్రిటిక్స్ (Critics) నుంచి పాజిటివ్ రివ్యూలను అందుకున్నా కానీ కలెక్షన్లు కొల్లగొట్టడంలో మాత్రం విఫలం అయింది. డిసెంబ‌ర్ 8వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇదే తన తొలి హిందీ చిత్రం కావడం గమనార్హం. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న వరుణ్ తేజ్ (Varun Tej) ఈ మూవీతో హిట్ (Hit)  కొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హిట్ కొట్టి తన స్టామినా ఏంటో ప్రేక్షకులకు మరోసారి చూపించాలని వరుణ్ తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. గత సినిమాల వల్లే పొరపాట్లు జరగకుండా వరుణ్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ చిత్రంతో హిట్ అందుకుంటాడో లేక తన పాత చిత్రాల మాదిరిగానే ఈ మూవీ కూడా డిజాస్టర్ (Disaster) టాక్ ను తెచ్చుకుంటుందో త్వరలో తెలియనుంది.