Dhruva Natchathiram: తెలుగు రాష్ట్రాల్లో రూ.7 కోట్లకు అమ్ముడుపోయిన విక్రమ్ స్పై థ్రిల్లర్ మూవీ

నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి

Courtesy: Twitter

Share:

Dhruva Natchathiram: గతంలో కోలీవుడ్‌ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌ (Vikram) నటించిన 'కోబ్రా,(Cobra)' 'మిస్టర్ కెకె,'(Mr KK) మరియు 'స్వామి స్క్వేర్'(Swamy Square) వంటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆడకపోయినా, తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్(Gautham Menon) తెరకెక్కించిన ధృవ నచ్చతిరమ్ (Dhruva Nachathiram) ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల (Distributors) నుండి రూ.7 కోట్లు సంపాదించినట్లు సమాచారం. 

విక్రమ్ (Vikram) ఇటీవలి కాలంలో తెలుగు సినిమా మార్కెట్‌లో కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ, విక్రమ్- గౌతమ్ మీనన్‌ల కాంబినేషన్(Vikram- Gautham Menon) తెలుగు డిస్ట్రిబ్యూటర్లలో కాన్ఫిడెన్స్‌ని పెంచింది. స్పై థ్రిల్లర్(Spy Thriller) యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ (Telugu dubbed version) విలువ రూ. 7 కోట్లుగా అంచనా వేయబడింది, ఈ రోజుల్లో విక్రమ్ చిత్రానికి ఇది మంచి ధరగా పరిగణించబడుతుంది, ఇది పూర్తిగా కొనుగోళ్లు మరియు పంపిణీ హక్కులు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో విజయవంతమైన 'శివపుత్రుడు(Shiva Puthrudu)' 'అపరిచితుడు,' (Aparichithudu) మరియు 'ఐ'(I) వంటి డబ్బింగ్ సినిమాలతో విక్రమ్ బహుముఖ నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. శ్మశాన కాపలాదారు నుండి లాయర్‌గా విజిలెంట్‌గా మరియు మోడల్‌గా మారిన కిల్లర్‌గా విభిన్న పాత్రలను అప్రయత్నంగా పోషించినందున తెలుగు ప్రేక్షకులు అతని నటనా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అతను కింగ్ కరికాలన్ పాత్రను పోషించిన 'పొన్నియిన్ సెల్వన్'లో(Ponniin Selvan') అతని ఇటీవలి విజయం, పరిశ్రమలో బలమైన పునరాగమనాన్ని సూచిస్తూ అతని కీర్తిని మరింత పటిష్టం చేసింది.

'స్కెచ్', 'ఇంకొక్కడు' వంటి సినిమాలు అంతగా రాణించకపోవడంతో విక్రమ్‌కి (Vikram) తెలుగు రాష్ట్రాల్లో రేటింగ్స్ తగ్గాయి. ఈ సమయంలో, సూర్య(Surya), విజయ్(Vijay) మరియు కార్తీ (Karthi) వంటి పోటీదారులు మరింత ప్రజాదరణ పొందారు. ఇప్పుడు, విక్రమ్ తన రాబోయే చిత్రం 'తంగళన్'పై(Tangalan) తెలుగు మార్కెట్‌ను మలుపు తిప్పడానికి మరియు తన విజయాన్ని మళ్లీ స్థాపించడానికి తన ఆశలు పెట్టుకున్నాడు.

చియాన్‌ విక్రమ్‌ (Vikram) కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో తాజా మోస్ట్‌ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). గౌత‌మ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. స్పై థ్రిల్లర్ ట్రైలర్ 2017లో విడుదలైంది మరియు సినిమా థియేటర్లలోకి రావడానికి ఆరు సంవత్సరాలు పట్టింది.

రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త లుక్స్‌ను షేర్ చేస్తూ అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తున్నాడు విక్రమ్‌ (Vikram). ఇప్పటికే రిలీజ్‌ చేసిన పలు పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో స్టైలిష్‌ లుక్‌ను షేర్ చేశాడు. విక్రమ్‌ హెలికాప్టర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కు సంబంధించిన లుక్‌ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ (Treding) అవుతోంది. గౌతమ్‌ మీనన్‌(Gautham Menon) ఈ చిత్రంలో గూస్‌బంప్స్‌ తెప్పించే స్టైలిష్ యాక్షన్‌ సీన్లను పెట్టాడని తాజా స్టిల్‌తో అర్థమవుతోంది. రీసెంట్‌గా విక్రమ్ సూట్‌కేస్‌ పట్టుకొని స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న లుక్‌ను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

విక్రమ్‌ సూపర్ స్టైలిష్‌ లుక్‌తో అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ అందించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చెబుతున్నాయి. ధ్రువ నక్షత్రం (Dhruva Natchathiram) నుంచి లాంఛ్ చేసిన తమిళ, తెలుగు ట్రైలర్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మెడలో స్కార్ప్‌, స్టైలిష్ బ్లాక్ గాగుల్స్‌ వేసుకున్న విక్రమ్ చేతిలో పిస్తోల్‌ పట్టుకొని అగ్రెసివ్‌గా కనిపిస్తున్న లుక్‌ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ముంబై దాడులు (Mumbai attacks) జరిగినప్పుడు అక్కడికి ఎన్‌ఎస్‌జీ (NSG) హెలికాప్టర్‌ రావడం బాగా ఆలస్యమైంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైన ధ్రువ నక్షత్రం(Dhruva Natchathiram) ట్రైలర్.. సినిమా అతి ముఖ్యమైన మిషన్‌ నేపథ్యంలో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్‌(Aishwarya Rajesh), సిమ్రాన్‌, రాధికా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హరీష్‌ జైరాజ్‌(Harris Jayaraj) మ్యూజిక్‌ అందిస్తున్నాడు. యాక్షన్‌ స్పై జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ జాన్/ధ్రువ్‌ పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం‌.ఈ చిత్రం నుంచి ఇటీవలే కరిచేకళ్లే చూసి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది.