Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఉపవాసం ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?

మీరు కూడా పాటించండి..

Courtesy: Twitter

Share:

Intermittent Fasting: ఒక నిర్దిష్టమైన టైంకి భోజనం మానేయడం లేదా నిర్దిష్ట గంటలలో మాత్రమే తినడంను ఇంటర్మిటెంట్ ఉపవాసం(Intermittent fasting) అని పిలుస్తారు, మీ శరీరం కొవ్వును కరిగించడానికి(Melt Fat), రక్తంలో చక్కెరను నియంత్రించడానికి(Control Blood Sugar) మరియు బరువు తగ్గడానికి (Weight Loss)సహాయపడుతుంది. ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

చాలామంది.. పండుగ రోజుల్లో, పర్వదినాలలో ఉపవాసం చేస్తూ ఉంటారు. దైవారాధనలో ఉపవాసాన్ని ఓ దీక్షలా పాటిస్తారు. దీని వెనకు ఆధ్యాత్మిక పరమార్ధమే కాదు.. అతర్లీనంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్మిటెంట్ ఉపవాసం(Intermittent Fasting) .. పర్వదినాల్లోనే కాకుండా.. వారానికి ఒక రోజు దీన్ని పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు(Good For Health) జరుగుతుందని చెబుతున్నారు. ఇంటర్మిటెంట్ ఉపవాసం(Intermittent Fasting) మన శరీరాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వారానికి ఒక రోజు  ఉపవాసం ఉంటే.. అనేక అనారోగ్యాలు(Illnesses) దూరం అవుతాయి. ఇంటర్మిటెంట్ ఉపవాసం(Intermittent Fasting) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

బరువు తగ్గుతారు(Weight Lose)..

బరువు తగ్గడానికి(Weight Lose).. వర్కవుట్లు, రకరకాల డైటింగ్‌లు(Dieting) చేస్తూ ఉంటారు. వారానికి ఒకసారి ఉపవాసం(Fasting) ఉంటే.. త్వరగా బరువు తగ్గుతామని నిపుణులు చేబుతున్నారు. ఉపవాసం మన శరీరంలో జీవక్రియను(Metabolism) వేగవంతం చేస్తుంది, ఇది బరువు(Weight) తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి.. క్యాలరీను(calorie) రిస్ట్రిక్ట్‌ చేయడం కంటే, ఉపవాసం ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండెకు మంచిది(Heart Problems)..

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణం గుండె సమస్యలు(Heart Problems). వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే.. గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.  ఇంటర్మిటెంట్  ఉపవాసం(Intermittent fasting) మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉపవాసం చేస్తే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో(Control of hypertension) ఉంటడంతో పాటు.. ట్రైగ్లిజరైడస్‌ స్థాయిలు(Triglycerides levels) కూడా తగ్గుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

జీర్ణవ్యవస్థకు(Digestive System) మంచిది

మనం రోజూ ఆహారం తింటూ ఉంటే జీర్ణవ్యవస్థ(Digestive System) నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ఉపవాసం జీర్ణవ్యవస్థకు చిన్న బ్రేక్‌ ఇస్తుంది. దీని వల్ల గట్‌ హెల్త్‌ మెరుగుపడుతుంది. వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తే.. జీర్ణవ్యవస్థ సమస్యలు దూరం అవుతాయి. ఉపవాసం వల్ల శరీరం తనని తాను రిపేర్‌ చేసుకుంటుంది.

ఇన్ఫ్లమేషన్‌ను(Inflammation) తగ్గిస్తుంది

దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్‌(Chronic inflammation) కారణంగా.. మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్‌ కారణంగా గుండె సమస్యలు(Heart Problems), క్యాన్సర్‌(Cancer), రుమటాయిడ్ ఆర్థరైటిస్(Rheumatoid arthritis) వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉపవాసం ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి.. ఆరోగ్యాని మెరుగ్గా ఉంచుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి.

శరీరం నుంచి వ్యర్థాలు (Toxins) తొలగుతాయి

మన శరీరంలో.. టాక్సిన్స్(Toxins), వ్యర్థ పదార్థాలు(Waste materials) పేరుకుని ఉంటాయి. వీటిని శరీరం నుంచి తొలగించడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే.. మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు తొలగుతాయి. దీని వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

డయాబెటిస్‌కు(Diabetes) చెక్..

వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, డయాబెటిస్‌(Diabetes) బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉపవాసం రక్తంలో చక్కెరను 3-6 శాతం తగ్గిస్తుంది. ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలను (Insulin levels) 20-31 శాతం తగ్గిస్తుంది, ఇది టైప్ 2 మధుమేహం నుంచి రక్షిస్తుంది.

వృద్ధాప్య ఛాయలు (Aging process) త్వరగా రావు..

వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే.. ఏజింగ్‌ ప్రాసెస్‌(Aging process) నెమ్మది అవుతుందని, లైఫ్‌స్పాన్‌ పెరుగుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఎలుకలను ఉపవాసం ఉంచితే.. ఇతర ఎలుకల కంటే 83 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నాయని గుర్తించారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

కొంతమంది కనీసం నీరు కూడా తాగకుండా.. ఇంటర్మిటెంట్ ఉపవాసం(Intermittent fasting) చేస్తుంటారు. రోజంతా నీరు తాగకపోతే.. ప్రధాన అవయవాలకు చాలా ప్రమాదం. ఫాస్టింగ్‌ ఉన్న తర్వాత రోజు.. ముందు రోజు ఏమి తినలేదని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు.


గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.